శశికళ అంత్యక్రియలకు వచ్చేందుకు భర్తకు అనుమతి

31 Mar, 2017 10:19 IST|Sakshi
శశికళ అంత్యక్రియలకు వచ్చేందుకు భర్తకు అనుమతి

అమెరికాలో దారుణహత్యకు గురైన శశికళ (40), కుమారుడు అనీష్‌ సాయి (7)ల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత దేశానికి వచ్చేందుకు శశికళ భర్త నర్రా హనుమంతరావుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. న్యూజెర్సీలోని బర్లింగ్టన్‌లో శశికళ, అనీష్ రక్తపు మడుగులో పడి ఉండగా ఈ హత్యలపై హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, అతడికి కేరళకు చెందిన వేరే మహిళతో సంబంధం ఉందని వివరిస్తూ తన సోదరుడికి శశికళ ఈమెయిల్ పంపడం, ఆ తర్వాతే ఆమె హత్యకు గురి కావడంతో తమ అల్లుడే కూతురిని, మనవడిని హతమార్చి ఉంటాడని శశికళ తల్లిదండ్రులు ఆరోపించారు.

అయితే.. అమెరికాలో మాత్రం అతడి మీద ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో.. అతడి ప్రయాణాలను నియంత్రించడం లేదని, తమవాళ్ల అంత్యక్రియలకు వెళ్లేందుకు హనుమంతరావుకు అనుమతి ఉందని బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ అధికార ప్రతినిధి జోయెల్ బెవ్లీ తెలిపారు. హనుమంతరావుకు చాలా గట్టి ఎలిబీ ఉందని కూడా అంటున్నారు. హనుమంతరావు గత వారం రోజులుగా వేరే మహిళతో ఉంటున్నాడని బర్లింగ్టన్ ప్రాంతంలోని సీబీఎస్ ఫిల్లీ చానల్ చెబుతోంది. ఆ మహిళ ఎవరన్నది మాత్రం చెప్పలేదు.

అమెరికాలో ఇద్దరు తెలుగువాళ్లు దారుణ హత్య!

ఎన్నారైల హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు