'మీరు చెప్పక్కర్లేదు మాకు తెలుసు'

18 Jan, 2017 15:16 IST|Sakshi
'మీరు చెప్పక్కర్లేదు మాకు తెలుసు'
న్యూఢిల్లీ: వార్తలను ప్రజలకు ఎలా అందజేయాలో తమకు తెలుసని.. అధ్యక్షుడి నీతులు మాకు అవసరం లేదని అమెరికన్ ప్రెస్ కార్ప్స్ పేర్కొంది. ఈ మేరకు మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డోనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి లేఖ రాసింది. ట్రంప్ కు అమెరికన్ కార్ప్స్ కు ఆది నుంచి మధ్య మంచి సంబంధాలు లేవు. ఓ దివ్యాంగుడైన రిపోర్టర్‌ ను ఉద్దేశించి ట్రంప్ హేళనగా మాట్లాడారు.
 
దీనిపై స్పందించిన అమెరికన్ కార్ప్స్ కొలంబియా జర్నలిజం రివ్యూలో జర్నలిస్టుల పేరిట ఓ బహిరంగ లేఖను ప్రచురించింది. మీడియా ఎలా వుండాలనే దానిపై మీకు కొన్ని అభిప్రాయాలు ఉంటే.. తమవి తమకు ఉన్నాయని లేఖలో వ్యాఖ్యానించింది. పాఠకులకు వార్తలను ఎలా అందించాలనే విషయాన్ని తాము నేర్చుకోవాల్సిన పరిస్ధితిలో లేమని పేర్కొంది.
 
లేఖలో పేర్కొన్న మరికొన్ని విషయాలు:
- అమెరికా అధ్యక్షుడి విషయాలకు ప్రాధాన్యత ఇస్తాం. కానీ, అత్యవసరం కాదు.
- ఆఫ్ ది రికార్డ్ తదితర నిబంధనలు మీడియాకు సంబంధించినవి. ఈ విషయంలో జోక్యం వద్దు.
- అధ్యక్షుడు మాట్లాడేప్పుడు ఎంతసేపు ప్రసారం చేయాలి అనేది మా సంబంధించిన అంశం.
- ఓ చోట నిష్పక్షపాత నిజం ఉందని తెలిస్తే.. అధ్యక్షుడినైనా అడ్డుకుంటాం.
- అమెరికా ప్రభుత్వ సమాచారాన్ని బహిర్గతం చేస్తాం.
- మునుపెన్నడూ లేనివిధంగా మాకు మేమే అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటాం.
- అమెరికా ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం.
మరిన్ని వార్తలు