'కేజ్రీవాల్ ప్రమాదవశాత్తు గెలిచాడు'

12 Mar, 2014 13:06 IST|Sakshi
'కేజ్రీవాల్ ప్రమాదవశాత్తు గెలిచాడు'

ఢిల్లీకి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాదవశాత్తూ విజయం సాధించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిన్హా సోమవారం అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. శాసనసభ ఎన్నికలలో 28 సీట్లు సాధించి జీవితానికి సరిపడ ఇమేజ్ సంపాదించారన్నారు. కేజ్రీవాల్ అశ్వమేథయాగాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు. అందులోభాగంగా ఆయన గుజరాత్లో పర్యటించారని, ఆ సమయంలో గుజరాత్ పోలీసులు ఆయన్ని ఆపి కొన్ని ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు. అందుకు నిరసనగా ఆప్ కార్యకర్తలు న్యూఢిల్లోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగడాన్ని ఆయన ఖండించారు.

 

గుజరాత్లో పర్యటన సందర్బంగా కేజ్రీవాల్ కోడ్ ఆఫ్ కాండక్టను అతి క్రమించిడం వల్లే పోలీసులు ఆయన్ని ఆపారని తెలిపారు. అంతేకాని బీజేపీ నాయకుల ఆదేశాల మేరకు కేజ్రీవాల్ను అప లేదని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పించడం పట్ల యశ్వంత్ సిన్హా కొంత అసహనం వ్యక్తం చేశారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ ఆరోపించడంపై ఆయన స్పందించారు. బీజేపీపై హానికరమైన అపవాదులు మోపడం ఆయనకు తగదన్నారు. మహాత్ముడు గాంధీజిని భౌతికంగా ఎవరు చంపారో అందరికి తెలుసు, అయితే గాంధీజీ సిద్దాంతాలను చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఓ క్రమపద్దతి ప్రకారం నిర్మూలిస్తుందని యశ్వంత్ సిన్హా విమర్శించారు.

మరిన్ని వార్తలు