-

ఆశపడింది.. దొరికిపోయింది!

20 Apr, 2017 17:58 IST|Sakshi
ఆశపడింది.. దొరికిపోయింది!
రామనగర: నెల రోజులుగా రామనగర తాలూకా అరేహళ్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు గురువారం ఉదయం బోనులో చిక్కుకుంది. గ్రామస్తులు అధికారులకు విషయాన్ని తెలిపారు. స్పందించిన  అటవీ అధికారులు అరేహళ్లి గ్రామం శివారులో మరి చిక్కగౌడ అనే రైతుకు చెందిన మామిడి తోటలో  ఏర్పాటు చేసిన బోనులో చిక్కిపోయింది.

కట్టేసిన మేకను తినడానికి వచ్చిన చిరుత  దొరికిపోయింది. ఈ ప్రాంతంలో  ఈ ఏడాదిలో పట్టుబడిన రెండో చిరుతపులి ఇది. చిరుత చిక్కడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుత నెల రోజులుగా రాత్రిళ్లు గ్రామాల్లో ప్రవేశించి మేకలు, కుక్కలను ఎత్తుకెళుతోంది.
మరిన్ని వార్తలు