సెప్టెంబర్‌ 14–16 తేదీల్లో టింబక్టు సందర్శన

8 Aug, 2017 01:00 IST|Sakshi

కరువు సీమ అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలంలో బంజరు భూము లను సస్యశ్యామలంగా మార్చడం.. 20 వేల మంది చిన్న, సన్న కారు రైతు కుటుంబాలను కూడగట్టి.. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను వర్షాధారంగా సేంద్రియ సేద్యం చేయించటం, సహకార సంఘం ద్వారా మార్కెటింగ్‌ చేయడం, పిల్లలకు ప్రకృతి విద్యనందించడంలో టింబక్టు కలెక్టివ్‌ సంస్థ కీలకపాత్ర పోషిస్తోంది. టింబక్టు కలెక్టివ్‌ చేస్తున్నదేమిటో స్వయంగా తెలుసుకోవాలనుకునే వారికోసం సెప్టెంబర్‌ 14–16 తేదీల్లో సందర్శకులను అనుమతిస్తారు. ఆంగ్లం (కొంత వరకు తెలుగు)లో సాగే ఈ సందర్శన శిబిరంలో పాల్గొనదలచిన వారు 099893 00332 నంబరులో లేదా timbaktu.info@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.

Read latest Vanta-panta News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు