శ్రీవారి ఆలయంలో ఇద్దరు వంట స్వాముల సస్పెన్షన్‌

9 Feb, 2018 12:09 IST|Sakshi

నేతి డబ్బాల చోరీ ఘటనపై చర్యలు

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల:  చినవెంకన్న ఆలయంలో శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే నేతి డబ్బాలను మాయం చేసిన ఘటనలో ఇద్దరు వంట స్వాములను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకొక్కటి 15 కేజీల బరువైన మూడు నేతి డబ్బాలు చోరీకి గురైనట్టు తెలుసుకున్న అధికారులు ఈనెల 5న ఆలయానికి సమీపంలో ఉన్న శేషాచార్యులు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మూడు నేతి డబ్బాలు అక్కడ దర్శనమిచ్చిన విషయం విదితమే. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు వంట స్వాములను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

మరిన్ని వార్తలు