ఈజిప్టులో బయటపడ్డ 50 మమ్మీలు

4 Feb, 2019 14:24 IST|Sakshi

కైరో : మమ్మీలకు నిలయమైన ఈజిప్టులో తాజా గా మరో 50 మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్టులోని తూర్పు మల్లావిలో టు నా ఎల్‌ గెబల్‌ ప్రాంతంలో ఓ భారీ సమాధిని గుర్తించారు. దాదాపు తొమ్మిది మీటర్ల లోతైన గదులున్న ఈ సమాధిలో మొత్తం 50 మమ్మీలను గుర్తించారు. వాటిలో చిన్నపిల్లల శరీరాలను భద్రపర్చిన మమ్మీ లు 12 ఉన్నాయని పురాతత్వశాస్త్రవేత్తలు తెలిపారు. రోమన్‌ లేదా బైజాన్టియన్‌ కాలం నాటి మమ్మీలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

50 మమ్మీల్లో 40 పూర్తిగా వెలికితీశామని, వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని ఈజిప్టు పురావస్తు విభాగం సుప్రీం కౌన్సిల్‌ సెక్రటరీ జనరల్‌ ముస్తఫా వజీరీ తెలిపారు.  ఈ మమ్మీలను చాలా వరకు కుండల్లో భద్రపర్చారని, కొన్ని మమ్మీలపై నాటి భాషలో రాసిన విశేషాలు ఉన్నాయని, ఈజిప్షియన్‌ కాలంలో ఈ భాష సాధారణ ప్రజానికంలో వినియోగంలో ఉండేదని చెప్పారు. మిన్యా విశ్వవిద్యాలయం నేతృత్వంలో చేపట్టిన ఈ సంయుక్త కార్యక్రమంలో తొలిసారి ఈ మమ్మీలను కనుగొన్నారు.

మరిన్ని వార్తలు