కడ్తాల్‌ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

18 Nov, 2023 01:50 IST|Sakshi
కుమురం భీం పాత్రలో అజయ్‌

సోన్‌: గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, సిద్దార్థ యోగా విద్యాలయం, సోషల్‌ ఫోరం వారు సంయుక్తంగా నిర్మల్‌ జిల్లా మంజులపూర్‌ ఉన్నత పాఠశాలో ఏర్పాటు చేసిన ఉపన్యాస పోటీల్లో సోన్‌ మండలం కడ్తాల్‌ పాఠశాల 8వ తరగతి విద్యార్థి యం. చైత్ర ప్రథమ స్థానంలో నిలిచింది . రూ.3 నగదు, ప్రశంసాపత్రం అందుకుంది. అదేవిధంగా కుమురంభీం ఏక పాత్రాభినయంలో జిల్లాస్థాయి పోటీలలో 10వ తరగతి విద్యార్థి అజయ్‌ ప్రతిభ కనబర్చాడు. జిల్లాస్థాయి అండర్‌–14 వాలీబాల్‌ విభాగంలో అక్షర ఉత్తమ ప్రతిభ కనబరిచంది. ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు