‘ఎస్సీలను వర్గీకరిస్తే ఊరుకోం’

18 Nov, 2023 01:50 IST|Sakshi
ఐక్యత చాటుతున్న మాల సంఘం నాయకులు

బెల్లంపల్లి: ఎస్సీలను వర్గీకరిస్తే కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని మా ల ప్రజాసంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ జీ చెన్నయ్య పేర్కొన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. బీజేపీ కులరాజకీయాలకు పాల్ప డుతోందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాయమాటలు చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మాల ప్రజాసంఘాల వర్కింగ్‌ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, రమేశ్‌, శ్రీధర్‌రావు, సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి యాదగిరి, నాయకులు మధుకర్‌, మధు, ప్రభాకర్‌, ప్రతాప్‌, మురళి, జనార్దన్‌, ప్రదీప్‌, తిరుపతి ఉన్నారు.

మరిన్ని వార్తలు