మహిళా సాధికారత కోసమే ‘వైఎస్సార్‌ చేయూత’

28 Sep, 2020 18:55 IST|Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, తాడేపల్లి: ‘వైఎస్సార్‌ చేయూత పథకం’పై మంత్రులు సోమవారం సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అప్పలరాజు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ‘వైఎస్సార్‌ చేయూత’కు రూ.4,643 కోట్లు గత ఏడాది నిధులు కేటాయించామని, ఈ నెల 11న  రూ.6,790 కోట్లు చేయూతకు నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. (చదవండి: మహిళల ఆధ్వర్యంలో లక్ష రిటైల్‌ షాపులు

మహిళలు సాధికారత సాధించేందుకు చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పలు వ్యాపార సంస్థలు, బ్యాంకులతో చర్చించి మహిళలు వ్యాపారం చేసేలా ప్రోత్సాహం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 21 లక్షల మంది వివిధ వ్యాపారుల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. 8 లక్షల మంది పాత షాపులనే కొనసాగిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేంత వరకు సమీక్షలు కొనసాగిస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆమే’ రాణి)

మరిన్ని వార్తలు