మదనపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో పేలుళ్ల కలకలం

11 Aug, 2021 07:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిత్తూరు: మదనపల్లిలోని ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్ళు కలకలం సృష్టించాయి. భవన నిర్మాణం కోసం డీమార్ట్‌ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లను పేల్చారు. భారీగా పేలుడు సంభవించడమే గాక బండరాళ్లు ఆ పరిసరాల్లోని నివాస గృహాలపై పడ్డాయి. దీంతో పలు ఇళ్లు దెబ్బతినడంతో పాటు ఐదుగురికి గాయాలుకాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డీమార్ట్‌ సంస్థపై స్థానికుల మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు