మల్లన్నను దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్

26 Feb, 2023 11:56 IST|Sakshi
ఆలయం వద్ద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలుకుతున్న అర్చక స్వాములు, దేవస్థానం చైర్మన్, ఈవో తదితరులు

శ్రీశైలం టెంపుల్‌(నంద్యాల జిల్లా): శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ధనుంజయ వై.చంద్రచూడ్, కల్పనాదాస్‌ దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, సత్యప్రభ దంపతులు శనివారం రాత్రి దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ మర్యాదలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.

అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి దంపతులు రత్నగర్భ స్వామిని దర్శించుకుకున్నారు. ఆ తర్వాత మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు.

అనంతరం మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని, అనంతరం భ్రమరాంబాదేవి అమ్మ వారిని దర్శించుకున్నారు. వీరి వెంట పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శ్రీశైలం శాసన సభ్యుడు శిల్పాచక్రపాణి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, రాష్ట్ర రిజి్రస్టార్‌ జనరల్‌ వై.లక్ష్మణరావు, తెలంగాణ రాష్ట్ర రిజి్రస్టార్‌ జనరల్‌ కె.సుజన, దేవదాయ శాఖ కమిషనర్‌ ఎం హరిజవహర్‌లాల్, కర్నూలు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి ఎన్‌.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు