ఆ కేసులను ఎత్తివేస్తున్నాం: సీఎం జగన్‌

21 Apr, 2022 13:30 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: గతంలో గ్రాసిమ్‌ ప్రాజెక్టు సంబంధించి జరిగిన ఆందోళనల్లో 131 మందిపై కేసులు నమోదయ్యాయని.. ఆందోళనకారులపై ఆ కేసులను ఎత్తివేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ రోజే జీవో విడుదల చేస్తున్నామని తెలిపారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రా‌సిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి  సీఎం జగన్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రాసిమ్‌ పరిశ్రమతో ప్రత్యక్షంగా 1300 మంది, పరోక్షంగా 1150 మందికి ఉపాధి కలుగుతుందని సీఎం అన్నారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా చట్టం చేశామన్నారు.

చదవండి: మన పంతం 'అవినీతి అంతం'

‘‘ఎన్నికలకు 2 నెలల ముందు గత ప్రభుత్వం గ్రాసిమ్‌ సంస్థకు ప్రాజెక్ట్‌ అప్పగించింది. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసింది. అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేశామన్నారు. అవరోధాలను ఒక్కొక్కటికీ తొలగించి ప్రాజెక్టు నెలకొల్పామన్నారు. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతో పరిశ్రమ ఏర్పాటు  చేశారన్నారు. టెక్నాలజీ మార్పు ద్వారా జీరో లిక్విడ్‌ వేస్ట్‌ డిశ్చార్జ్‌ చేశారన్నారు. భయాలకు తావులేకుండా ప్రాజెక్టు నెలకొల్పారని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు