Fact Check: కౌలు రైతన్నలపై రామోజీ కుళ్లు

20 Dec, 2023 04:24 IST|Sakshi

 భూ యజమానులతో సమానంగా కౌలుదారులకు సంక్షేమ ఫలాలు.. అయినా పెత్తందారీ పోకడలతో రామోజీ రోత రాతలు

సాక్షి, అమరావతి: బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉండే కౌలు రైతులకు మంచి చేస్తుంటే ఈనాడు రామోజీ కుళ్లుతో కుతకుత­లాడి­పోతున్నారు! వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఈ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ రోత రాతలకు తెగబడ్డారు. భూ యజమానులతోపాటు వాస్తవ సాగుదారులకూ సంక్షేమ ఫలాలను అందిస్తూ మేలు చేస్తున్న ప్రభుత్వం మరెక్కడైనా ఆయనకు కనిపించిందా? గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం 2019ని తేవడమే కాకుండా సీసీఆర్సీల ఆధారంగా అన్ని ప్రయోజనాలను సీఎం జగన్‌ అందిస్తున్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం నుంచి పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు దురదృష్టవశాత్తూ ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్న­దాతల కుటుంబాలకు వారు కౌలు రైతు­లైనా సరే రూ.7 లక్షల చొప్పున పరి­హారం అందిస్తున్నారు. కౌలు రైతులకు ఈ క్రాప్‌ ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులతోపాటు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ), ఉచిత పంటల బీమాతో లబ్ధి చేకూరుస్తున్నారు. తుపాన్‌తో నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా కొనుగోలు చేయలేదు. 

రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు 
భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్ల­కుండా వాస్తవ సాగుదారులకు ప్రభుత్వం పంట సాగుదారు హక్కు పత్రాలు (సీసీఆర్సీ) జారీ చేస్తోంది. ఏటా ఖరీఫ్‌కు ముందు ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహి­స్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 25,86,178 మంది కౌలు రైతులకు సీసీఆర్సీలు జారీ చేశారు. అత్యధికంగా ఈ ఏడాది 8,25,054 మందికి సీసీఆర్సీలు జారీ అయ్యాయి. వాస్తవ సాగుదారు­లందరికీ పంట రుణా­లి­వ్వాలన్న సంకల్పంతో పీఏసీ­ఎస్‌­లను ఆర్బీకే­లతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీలు లేని కౌలు రైతులను గుర్తించి జాయింట్‌ లయబిలిటీ గ్రూపులు (జేఎల్‌జీ) నెలకొల్పి రుణాలు అందిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి­వరకు 14.39 లక్షల మంది కౌలుదా­రులకు రూ.8,246 కోట్ల రుణాలు అందాయి.


కౌలు రైతుకూ సంక్షేమ ఫలాలు
దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కౌలు రైతులకు రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందచేస్తోంది. కేంద్రం ఇవ్వకున్నా వైఎస్సార్‌ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదా­రులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకు కూడా ప్రభుత్వం అందిస్తోంది. సీసీఆర్‌సీ కార్డుల ఆధారంగా 9.52 లక్షల మందికి రూ.1,235.03 కోట్ల మేర వైఎస్సార్‌ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందచేశారు. రూ.లక్ష లోపు పంట రుణాలు పొందిన కౌలు­దారులకు ఈ – క్రాప్‌ ఆధారంగా వైఎస్సార్‌ సున్నా­వడ్డీ రాయితీ కూడా అందేలా చర్యలు చేపట్టారు.

ఇలా ఇప్పటి వరకు 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. 3.55 లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.41లక్షల మందికి రూ.253.56 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) పంపిణీ చేశారు. దురదృష్టవశాత్తూ ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు  భూ యజమానులతో సమానంగా రూ.7 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు రూ.90.72 కోట్లు పరిహారం అందించగా కౌలు రైతులకు రూ.34.65 కోట్లు సాయం అందింది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహ­త్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ.23.70 కోట్లు పరిహారం కింద ఈ ప్రభు­త్వమే చెల్లించింది. తాజాగా తుపాన్‌తో నష్టపో­యిన కౌలు రైతులు, అటవీ భూ సాగుదారులకు సైతం పంట నష్ట పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. 4.42 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు గుర్తించి రూ.703 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. ప్రస్తుతం పంట నష్టం తుది అంచనాల ప్రక్రియ కొనసాగుతోంది. భూ యజమానులతో పాటు సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులకు కూడా 80 శాతం రాయితీతో 86 వేల క్వింటాళ్ల విత్తనాలను తిరిగి విత్తుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసింది. 

>
మరిన్ని వార్తలు