జగనన్న కాలనీలు.. సౌకర్యాల నిలయాలు

2 Jul, 2021 08:11 IST|Sakshi

కుటుంబ కనీస అవసరాలకు అనుగుణంగా పేదల ఇళ్ల డిజైన్‌

గతంలో 224 అడుగులే.. ఇప్పుడు 340 చదరపు అడుగులు

నాడు విద్యుత్‌ ఉపకరణాలు కొనుక్కోవాల్సిందే.. నేడు ఉచితం

ఐదేళ్లలో కట్టినవి 6.03 లక్షలు.. ఇప్పుడు రెండు దశల్లో 28.30 లక్షల గృహాలు

సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు సందడిగా సాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా జాతీయ స్థాయి ప్రమాణాలకు మించి లోగిళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గత సర్కారు హయాంలో కంటే అదనంగా 116 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను కడుతున్నారు. ఉచితంగా గృహోపకరణాలు, కాలనీల్లో మెరుగైన మౌలిక వసతులు, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఇళ్ల నిర్మాణం ద్వారా వైఎస్సార్‌ – జగనన్న కాలనీల్లో పేదలకు ఉత్తమ జీవన ప్రమాణాలు సమకూరనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలందరికీ 30.76 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో పంపిణీ చేసి, రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలోనూ అంతే వేగంగా ముందుకు వెళుతోంది. ఇళ్ల స్థలాలు పొందిన వారికి  రెండు దశల్లో మొత్తం 28,30,227 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 

నాడు అలా
టీడీపీ సర్కారు హయాంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, 24 చదరపు అడుగుల్లో టాయిలెట్‌ నిర్మించారు.
ఒక బెడ్‌ రూం, వంటగదితో కూడిన లివింగ్‌ రూమ్‌ నిర్మించారు.  
2014–19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,082.89 కోట్లతో 6,03,986 ఇళ్లను మాత్రమే నిర్మించారు.
మౌలిక సదుపాయాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. 

నేడు ఇలా
ఉత్తమ జీవన ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా డిజైన్‌. 
340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం. 
ఒక బెడ్‌రూం, లివింగ్‌ రూం, కిచెన్, టాయిలెట్, వరండా.
ఉచితంగా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌ లైట్లు, నాలుగు బల్బ్‌లు, సింటెక్స్‌ ట్యాంక్‌.
కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాల కల్పన  

మరిన్ని వార్తలు