తల వెంట్రుకపై స్పోర్ట్స్‌ కప్‌

31 Jul, 2021 08:55 IST|Sakshi

తల వెంట్రుకపై స్పోర్ట్స్‌ కప్‌ను అమర్చి విశాఖ జిల్లా ఏటికొప్పాక కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి అందర్నీ అబ్బురపరిచారు. హస్తకళలో రాష్ట్రపతి అవార్డు పొందిన ఆయన.. మైక్రో ఆర్ట్‌తో రెండు రోజుల్లో ఈ అద్భుత కళాఖండాన్ని తీర్చి దిద్దారు. గుండు సూది గుండు(పైభాగం)పై గసగసాలను ఉంచి దానిపై 22 క్యారెట్ల బంగారంతో 0.55 మి.మీ. ఎత్తు, 0.20 మి.మీ వెడల్పుతో స్పోర్ట్స్‌ కప్‌ను తయారు చేసి తల వెంట్రుకపై అమర్చారు.
– యలమంచిలి రూరల్‌

మరిన్ని వార్తలు