రాష్ట్రాలకు అలాంటి పరిస్థితి లేదు: మంత్రి బుగ్గన

8 Nov, 2021 16:16 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: అన్‌రాక్‌ ఆర్బిట్రేషన్‌ పరిష్కారంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం అనేక సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిందన్నారు. ఒకసారి తగ్గించి రాష్ట్రాలను తగ్గించమంటే ఎలా? అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచలేదన్నారు. రాష్ట్రానికి పరిమితంగా ఆర్థిక వనరులు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆదాయ వనరులు వేరు.. కేంద్ర ఆదాయ వనరులు వేరు. కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.

చదవండి: బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని

మరిన్ని వార్తలు