పార్లమెంట్‌లో ప్రసంగించనున్న అనంత విద్యార్థి

12 Nov, 2022 09:47 IST|Sakshi

అనంతపురం కల్చరల్‌: యువతలో దేశభక్తి, నైతికతను పెంపొందించే దిశగా పార్లమెంటు ఆఫ్‌ ఇండియా, నెహ్రూ యువకేంద్ర సంయుక్తంగా ఏటా నిర్వహించే  వేడుకలకు దేశవ్యాప్తంగా 25 మంది యువతీ యువకులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఈనెల 14న  పార్లమెంటు ప్రాంగణంలో ప్రసంగించే అరుదైన అవకాశం జిల్లాకు చెందిన మెగాజోష్‌కి దక్కింది.

ఈ మేరకు నెహ్రూ యువకేంద్ర జిల్లా సమన్వయకర్త సందీప్‌కుమార్, డీడీవో శ్రీనివాసులు తెలిపారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో చదువుకుంటున్న ఆమె గతంలో అనేక వక్తృత్వ పోటీల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు.    

(చదవండి: జేసీ మనుషులమంటూ దౌర్జన్యం)

మరిన్ని వార్తలు