జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక!

29 May, 2022 08:11 IST|Sakshi

ఆకివీడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్టు ఆ పార్టీ ఆకివీడు మండల కమిటీ అధ్యక్షుడు నేరెళ్ల పెదబాబు శనివారం తెలిపారు.

ఆకివీడులోని ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన వీర్రాజు పార్టీ మండల కార్యాలయంలో కొద్దిసేపు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో జరిగే జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్‌ 7న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వస్తారని వీర్రాజు చెప్పినట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు