పూటుగా మద్యం తాగి గేట్‌మ్యాన్‌ నిద్ర.. ఆగిన రైలు

22 Nov, 2021 13:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నంద్యాల రూరల్‌: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఊడుమాల్పురం రైల్వేగేట్‌ వద్ద కాపలా ఉన్న గేట్‌మ్యాన్‌ శ్రీనివాసులు అదివారం తన స్నేహితుడితో కలిసి మద్యం తాగి అదే గదిలో నిద్రపోయాడు. సాయంత్రం కర్నూలు–నంద్యాల డెమో రైలు సమీపానికి వచ్చినా గేట్‌ వేయలేదని గమనించిన లోకోపైలెట్‌ రైలును ఆపి హారన్‌ మోగించారు. స్థానికులు రూమ్‌లో ఉన్న గేట్‌మ్యాన్‌ను నిద్రలేపారు. గేట్‌ వేయడంతో డెమో రైలు నంద్యాలకు వెళ్లింది. ఈ సమాచారం అందిన రైల్వే ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి గేట్‌మ్యాన్‌ను విచారించారు. అతడు మద్యం తాగాడని  తెలుసుకుని విధుల నుంచి తొలగించారు.
చదవండి: శభాష్‌ ఆర్టీసీ.. శభాష్‌ సజ్జనార్‌.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్‌   

మరిన్ని వార్తలు