నీకు కూడ అర్థం అయ్యిందిగా.. ఇప్పుడిది అవసరమని

17 Aug, 2021 19:03 IST|Sakshi

సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో సోమవారం ఉదయం ఓ వానర విన్యాసం చూసిన వారు ఔరా! అంటూ ముక్కున వేలేసుకున్నారు. స్థానిక శంకరప్పతోట వీధిలో ఓ ఇంటి ఎదుట పడి ఉన్న మాస్క్‌ తీసుకుని అటూఇటూ తిప్పి పరిశీలించిన వానరం.. అనంతరం దానిని మూతికి, ముక్కుకు వేసుకునే క్రమంలో తన ముఖం మొత్తం కప్పేసుకుని చకచకా  ఇంటిపైకి చేరుకుంది. ఇదంతా గమనించిన చుట్టుపక్కల వారు... కరోనా బారిన పడకుండా ఇకపై తాము కూడా మాస్క్‌ ధరించాలంటూ చర్చకు తెర తీశారు.

మరిన్ని వార్తలు