విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల నిరసనలతో దద్దరిల్లుతున్న ఢిల్లీ

2 Aug, 2021 13:57 IST|Sakshi

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికుల నిరసనలు

సాక్షి, ఢిల్లీ: విశాఖ ఉక్కు పోరాట కమిటీ ధర్నాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ మద్దతు ప్రకటించింది. ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంలోనూ కొనసాగుతున్న కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ ఎంపీ ధర్నాలో పాల్గొన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ఉద్యమం ఢిల్లీని తాకింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కార్మికుల నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ అప్పులను ఈక్విటీలుగా మార్చాలని డిమాండ్‌ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జంతర్‌మంతర్‌ వద్ద స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదాలతో ఢిల్లీ దద్దరిల్లుతోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు