ఢిల్లీలో రెండో రోజు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల నిరసనలు

3 Aug, 2021 11:38 IST|Sakshi

ఏపీ భవన్‌ వద్ద ధర్నా చేపట్టిన స్టీల్‌ప్లాంట్ కార్మికులు

స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు మద్దతు తెలిపిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రెండో రోజు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం.. ఏపీ భవన్‌ వద్ద స్టీల్‌ప్లాంట్ కార్మికులు ధర్నా చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయవద్దని కార్మికుల డిమాండ్ చేశారు. కార్మికులకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్‌, గీత, సత్యవతి, మాధవ్, కోటగిరి శ్రీధర్‌, ఎంవీవీ సత్యనారాయణ, అనురాధ, తలారి రంగయ్య ధర్నాలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ఉద్యమం మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.  న్యాయ పోరాటం చేసి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలన్నారు. సొంత గనులు ఇవ్వాలని, అప్పును ఈక్విటీగా మార్చాలని సూచించామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను ఉద్యోగుల యాజమాన్యంలో ఉంచితే బాగుంటుందని తన ఉద్దేశమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు