నాయుడుపేటలో మహిళ హల్‌చల్‌

13 Oct, 2022 09:46 IST|Sakshi

నాయుడుపేటటౌన్‌: నాయుడుపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఓ మహిళ బైఠాయించి గంటకు పైగా హల్‌చల్‌ చేసింది. రోడ్డుకి అడ్డంగా కూర్చుండిపోవడంతో రహదారిపై వాహనాలు బారులుతీరి నిలిచిపోయి ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న సీఐ సీహెచ్‌ ప్రభాకర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళతో మాట్లాడారు. ఆ మహిళ సీఐతో పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో ఆమె మానసిక స్థితి సరిగా లేన్నట్లు గుర్తించారు. ఆమె బ్యాగులో బురఖా ఉండడంతో ముస్లిం మహిళ అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. తర్వాత మహిళకు నచ్చజెప్పి స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉన్న రిసెప్షన్‌ సెంటర్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు