Today Horoscope: ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి, ఆకస్మిక ధనలబ్ధి

12 Sep, 2022 06:48 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.విదియ ప.1.14 వరకు, తదుపరి తదియ నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.9.31 వరకు, తదుపరి రేవతి వర్జ్యం: రా.9.26 నుండి 11.04 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.47 నుండి 3.36 వరకు అమృతఘడియలు: లేవు.

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. సోదరులతో కలహాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మిథునం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. ఆస్తివివాదాలు కొలిక్కి వస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. వ్యాపారాలు మరింత ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

సింహం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

తుల: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

ధనుస్సు: రుణభారాలు. దూరప్రయాణాలు. సోదరులతోకలహాలు. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆద్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మకరం: పొరపాట్లు సరిదిద్దుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ధనలబ్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం: విచిత్ర సంఘటనలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులలో పురోగతి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.
 

మరిన్ని వార్తలు