నానో సోలార్‌ కార్‌! రూ.30కే 100 కిలోమీటర్లు..

16 Mar, 2023 17:16 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నగరంలో నివాసం ఉండే మనోజిత్ మోండల్ అనే వ్యాపారవేత్త టాటా నానో కారుతో స్థానికంగా సెలబ్రిటీగా మారిపోయారు. తన టాటా నానో కారును సోలార్‌ కారుగా మార్చి వీధుల్లో రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. 

ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్‌ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా ప​న్ను లేదు!

మోండల్ కారు నడపడానికి పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ అవసరం లేదు. ఇది పూర్తిగా సౌర శక్తితో నడుస్తుంది. అయితే ఈ కారుకు అయ్యే ఇందన ఖర్చు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ. 30 నుంచి రూ. 35 లతో 100 కిలోమీటర్లు నడుస్తుంది. అంటే కిలోమీటరుకు 80 పైసలు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా తక్కువ ఖర్చుతో నడిచేలా మోండల్‌ రూపొందించిన నానో సోలార్‌ కార్‌ ఇప్పుడు అక్కడ సూపర్‌ పాపులర్‌ అయింది.

ఇంజిన్‌ లేదు.. సౌండ్‌ లేదు..
ఈ సోలార్ కారులో గేర్ సిస్టమ్ ఉంది. కానీ ఇంజిన్ లేదు. ఇది నడుపుతున్నప్పుడు అసలు శబ్దం రాదు. నాల్గవ గేర్‌లో ఇది గంటకు 80 కిలోమీటర్లు వెళ్తుంది. మోండల్ చేసిన తయారు ఈ సోలార్‌ కార్‌ సౌరశక్తిలో ఆవిష్కరణల దిశగా దిశానిర్దేశం చేయడమే కాకుండా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ కారును రూపొందించేటప్పుడు మోండల్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ పట్టు వదల్లేదు. కొత్తగా ఏదైనా చేయాలనే అతని చిన్ననాటి కలను ఈ కారు ద్వారా నిజం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఈ పథకంతో సీనియర్‌ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి!

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు