UIDAI Factcheck: ఆధార్‌ జిరాక్స్‌లు ఇవ్వకూడదా?

24 Feb, 2023 12:14 IST|Sakshi

ఆధార్ కార్డ్ ప్రస్తుతం అందరికీ అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌. ఏ ప్రభుత్వ పథకానికైనా ఇది కావాల్సిందే. ఎందుకంటే ఇందులో మీ పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలతోపాటు మీ బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది. దీంతో దీని ద్వారా అనేక మోసాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ.. కార్డుదారులకు ఎప్పటికప్పుడు పలు సూచనలు  ఇస్తుంటుంది. ప్రస్తుతం యూఐడీఏఐ పేరుతో సోషల్‌ మీడియాలో ఒక మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. 

యూఐడీఏఐ పేరుతో వైరల్ అవుతున్న ఆ మెసేజ్‌లో ఆధార్ కార్డుదారులు తమ ఆధార్ సంబంధిత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, ప్రభుత్వ పథకం కోసం అయినా సరే తమ ఆధార్‌ కార్డు జిరాక్స్‌లు సైతం ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అందులో ఉంది.  

అయితే ఆ మెసేజ్‌పై యూఐడీఏఐ క్లారిటీ ఇచ్చింది. అది పూర్తిగా ఫేక్ అని నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని, అందులో ఇచ్చిన యూఐడీఏఐ లింక్ కూడా తప్పు అని పేర్కొంది.

(ఇదీ చదవండి: ఉద్యోగికి యాపిల్‌ అపూర్వ బహుమతి! స్వయంగా టిమ్‌కుక్‌...)

మరిన్ని వార్తలు