అదానీ షేర్ల అండ: ఎట్టకేలకు లాభాల్లో సెన్సెక్స్‌

1 Mar, 2023 16:01 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలతో కళ కళలాడాయి. వరుసగా ఎనిమిదో రోజుల నష్టాల తరువాత లాభాలో ప్రారంభమైన సూచీలు మిడ్‌ సెషన్‌నుంచి పుంజుకున్నాయి. ముఖ్యంగా మెటల్, అదానీ గ్రూపు షేర్ల లాభాలు మద్దతిస్తాయి.  సెన్సెక్స్‌ 449 పాయింట్లు ఎగిసి   59,411వద్ద నిఫ్టీ 147  పాయింట్ల లాభంతో 17,451 వద్ద స్థిరపడ్డాయి.  

గత రెండు రోజుల గ్రూపు షేర్ల లాభాలతో  అదానీ గ్రూపు మార్కెట్‌  క్యాప్‌ 75 వేల  కోట్లు పుంజుకోవడం విశేషం. హిండెన్‌బర్గ్‌ వివాదం రేపిన అలజడితో భారీగా కుదేలైన అదానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది. 

అదానీ ఎంటర్‌  ప్రైజెస్‌, హిందాల్కో, యూపీఎల్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు టాప్‌ విన్నర్స్‌గా నిలవగా,  బ్రిటానియా, పవర్‌ గగ్రిడ్‌, సిప్లా, బీపీసీఎల్‌, ఎస్‌బీఐలైఫ్‌ ఇన్సూరెన్స్‌ టాప్‌  లూజర్స్‌గా నిలిచాయి.  అటు డాలరు మారకంలో 20పైసలు ఎగిసి 82. 50 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు