Cockroach In Food Packet: విమానంలో ‘బొద్దింక భోజనం’

15 Oct, 2022 09:26 IST|Sakshi

ఎయిర్‌ విస్తారా ఎయిర్‌లైన్‌ సదుపాయాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము తినే ఆహారంలో బొద్దింక ఉందంటూ విస్తారా ఎయిర్‌లైన్‌ ప్రయాణికుడు ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

అహ్మదాబాద్‌కు చెందిన నికుల్‌ సోలంకి ఎయిర్‌ విస్తారా ఎయిర్‌లైన్‌లో ప్రయాణించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే ప్రయాణ వివరాల్ని వెల్లడించని సోలంకి..ఫ్లైట్‌ జర్నీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.

 

ఎయిర్‌ విస్తారా ఫ్లైట్‌ జర్నీలో తాను ఆర్డర్‌ పెట్టిన ఇండ్లీ, సాంబార్‌, ఉప్మాలో చిన్న సైజు బొద్దింక ఉందని.. ఆ ఫోటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 

ఆఫోటోల్ని షేర్‌ చేసిన పదినిమిషాల్లో ఎయిర్‌ విస్తారా యాజమాన్యం స్పందించింది. ‘హలో నికుల్, మా భోజనాలన్నీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాల్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తాం. మీ విమాన ప్రయాణ వివరాల్ని తెలపండి. తద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎయిర్ విస్తారా ట్వీట్‌ చేసింది.  

విస్తారాపై టాటా గ్రూప్‌ కన్ను
విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేయడంపై టాటా గ్రూపుతో చర్చలు నిర్వహిస్తున్నట్టు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. టాటాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా కచ్చితమైన నిబంధనలపై అంగీకారానికి రాలేదని సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌కుకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సమాచారం ఇచ్చింది.కాగా, విస్తారాలో టాటా గ్రూప్‌కు 51 శాతం వాటా ఉంటే, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉంది.

చదవండి👉 ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్‌ విమానం ఎగిరింది

మరిన్ని వార్తలు