భారత్‌లో ఐఫోన్‌ 11 తయారీ

25 Jul, 2020 05:30 IST|Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా తమ ఐఫోన్‌ 11 స్మార్ట్‌ఫోన్లను తమిళనాడులోని ఫాక్స్‌కాన్‌ ప్లాంటులో ప్రారంభించింది. భారత్‌లో తయారవుతున్న ఐఫోన్‌ మోడల్స్‌లో ఇది అయిదోది. ‘2020లో ఐఫోన్‌ 11, 2019లో ఐఫోన్‌ 7.. ఎక్స్‌ఆర్, 2018లో ఐఫోన్‌ 6ఎస్, 2017లో ఐఫోన్‌ ఎస్‌ఈ. దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీ వ్యవస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరుకు ఇదే నిదర్శనం‘ అంటూ కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ .. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌ ప్లాంట్‌లో ఫాక్సా్కన్‌ గత కొన్ని నెలలుగా ఐఫోన్‌ 11ని అసెంబుల్‌ చేస్తోందని, గత నెల నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్‌ ఎక్స్‌ఆర్‌ ఫోన్లను కూడా ఫాక్స్‌కాన్‌ తయారు చేస్తుండగా, విస్ట్రాన్‌ సంస్థ ఐఫోన్‌ 7 స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తోందని వివరించాయి.

మరిన్ని వార్తలు