రండి! నా స్టార్టప్‌లో పనిచేయండి.. బెంజ్‌ కార్లు బహుమతిగా ఇస్తా!

10 Jan, 2023 21:14 IST|Sakshi

భారత్‌ పే మాజీ ఫౌండర్‌ అ‍శ్నీర్‌ గ్రోవర్‌ 3వ స్టార్టప్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్టార్టప్‌ భవిష్యత్‌ ప్రణాళికలు ఏంటనేవి లింక్డిన్‌ పోస్ట్‌లో షేర్‌ చేశారు అశ్నీర్‌. తాను ప్రారంభించిన కొత్త వెంచర్‌లో ఉద్యోగులు, పెట్టుబడి దారులకు స్వాగతం అంటూ ఆహ్వానించారు. పైగా కొత్త స్టార్టప్‌లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్లను బహుమతిగా ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. 

2023లో కొంత పని పూర్తి చేద్దాం! అంటూ థర్డ్‌ స్టార్టప్‌ పనులు చాలా నిశబ్ధంగా, శాంతియుతంగా కొనసాగుతున్నాయి.మార్కెట్‌ను షేక్‌ చేసేలా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాం. మేం విభిన్నంగా బిజినెస్‌ కార్యకలాపాలు చేస్తున్నాం. 

కాబట్టి మీరు తదుపరి టూడో - ఫోడో అంశంలో భాగం కావాలనుకుంటే బిజినెస్‌ను ఎలా చేస్తున్నామో మీరు తెలుసుకోవాలంటూ కొన్ని ఇమెజెస్‌ను చూపించగా.. అందులో థర్డ్ యునికార్న్‌కు వెంచర్ క్యాపిటలిస్ట్‌లు నిధులు సమకూర్చరని ఒక ఇమేజ్‌లో ఉంది. దేశీ/స్వయంగా సంపాదించిన మూలధనాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. జట్టులో 50 మంది సభ్యులు ఉంటారని అందులో జోడించింది. అంతే కాదు, ఉద్యోగులు కంపెనీలో ఐదేళ్లు పూర్తి చేస్తే, వారికి మెర్సిడెస్ ఇస్తామని అ‍శ్నీర్‌ గ్రోవర్‌ ఆఫర్ చేశారు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు