ఆడి ఆర్‌ఎస్‌ 5 స్పోర్ట్‌బ్యాక్‌

10 Aug, 2021 01:40 IST|Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి తాజాగా భారత్‌లో  ఆర్‌ఎస్‌ 5 స్పోర్ట్‌బ్యాక్‌ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.1.04 కోట్లు. 450 హెచ్‌పీ పవర్‌తో 2.9 లీటర్‌ వీ6 ట్విన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజన్‌తో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 3 జోన్‌ ఎయిర్‌కండీషనింగ్, పనోరమిక్‌ గ్లాస్‌ సన్‌రూఫ్‌ వంటివి పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. కంపెనీ పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తోంది.

మరిన్ని వార్తలు