బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ డేటా చైనా సర్వర్లలోకి!

24 Jun, 2021 12:51 IST|Sakshi

భారతీయులకు మరోషాక్‌ 

చైనాకు సర్వర‍్లలోకి వెళుతున్న యూజర్ల డేటా

డేటా పై ఆందోళన వ్యక్తం చేస్తున్న భారతీయులు

పబ్జీ..! అదేనండీ మనదేశంలో బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా పేరుతో విడుదలైన ఈ గేమ్‌పై మరో వివాదం తలెత్తింది. ఈ గేమ్‌ను ఆడేందుకు లాగిన్‌ అయిన ఇండియన్‌ యూజర్ల డేటా చైనా సర్వర్లలోకి వెళ్లిందనే ఆధారాలు కలకలం రేపుతున్నాయి.

దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన 116 యాప్స్‌పై కేంద్రం గతేడాది సెప్టెంబర్‌ 16న నిషేధం విధించిన విషయం తెలిసిందే. వాటిలో చైనా టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ కూడా ఉంది. వాస్తవానికి పబ్జీ చైనాది కాదు. సౌత్‌ కొరియాకు చెందిన యాప్‌. ఈ పేటెంట్‌ రైట్స్‌ ను చైనా టెన‍్సెంట్‌ సంస్థ దక్కించుకొని దాని కార్యకలాపాల్ని నిర్వ హిస్తుంది. వివిధ దేశాల్లో గేమ్‌ను రిలీజ్‌ చేసి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంది. 

కానీ బోర‍్డర్‌లో భారత్‌ పై కాలు దువ్విన చైనాకు చెక్‌ పెట్టేందుకు.. కేంద్రం చైనా యాప‍్స్‌ పై నిషేధం విధించింది. నిషేదంతో పబ్జీ మాతృసంస్థ సౌత్‌ కొరియాకు చెందిన క్రాఫ్టన్‌ సంస్థ పబ్జీ గేమ్‌ను కాస్తా బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియాగా మార్పులు చేసి మార్కెట్‌ లో విడుదల చేసింది. ఐజీఎన్‌ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం..  చైనా సంస్థ ముంబై కేంద్రంగా సర్వర్లను ఏర్పాటు చేసిందని, ఇప్పుడు విడుదలైన బీజీఎంఐ వినియోగదారుల డేటా ముంబైలో ఉన్న సర్వర్‌ లనుంచి  నుంచి అక్రమంగా చైనాలో ఉన్న సంస్థ సర్వర్లలోకి వెళ్లినట్లు పేర‍్కొంది. అందుకు సంబంధించిన ఆధారాల్ని విడుదల చేసింది. 

అయితే ఈ డేటా వ్యవహారంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురావడం లేదని, భారతీయుల డేటాను దొంగతనం చేసి సర్వర్లలోకి పంపుకోవడం ఎంత దారుణం అని ఒకరు కామెంట్‌ చేస్తుంటే .. చైనా ఉత‍్పత‍్తులపై బ్యాన్‌ విధించాలంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు