రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

3 Jun, 2021 19:59 IST|Sakshi

మిడ్-రేంజ్ విభాగంలో రూ.25 వేలలోపు స్మార్ట్ ఫోన్లు సరైన ప్రత్యేకతతో రావడమే కాకుండా ఈ విభాగంలో స్మార్ట్ ఫోన్స్ మంచి పనితీరుతో పాటుగా కెమెరా, సాఫ్ట్వేర్, డిజైన్ తో పాటు మొత్తం నిర్మాణంలో కూడా హై-ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లకు పోటీగా ఉండేలా కనిపిస్తాయి. రూ.25,000లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్, యాడ్-ఫ్రీ సాఫ్ట్వేర్, మల్టీ-కెమెరా సేటప్ విషయంలో మంచిగా పని చేయడానికి  ఫాస్ట్ మిడ్-రేంజ్ ప్రాసెసర్ తీసుకొస్తాయి. ఇవి పనితీరు విషయంలో ఏ మత్రం ఫ్లాగ్ షిప్ లకు తీసిపోవు అందుకే మార్కెట్లో రూ.25000లోపు అందుబాటులో ఉన్న ఫోన్స్ గురుంచి తెలుసుకుందాం.  

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62
మంచి పనితీరుతో పాటు ఎక్కువ కాలం బ్యాటరీ కావాలనుకునే వారి కోసం ఈ మొబైల్ మంచి ఎంపిక అవుతుంది. దీనిలో గెలాక్సీ నోట్ 10+లో ఉపయోగించిన ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అలాగే, ఇందులో 7,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఈ ధర వద్ద మంచి సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన కెమెరా, గేమింగ్ పనితీరును కనబరుస్తుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో దీనిని చార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో స్టాక్ యాప్స్ లో యాడ్స్ కూడా వస్తాయి. దేశ మొత్తంగా సర్విస్ కేంద్రాలు అందుబాటులో ఉండటం వల్ల అది ఒక అదనపు బలంగా దీనికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ.23,999గా ఉంది.

రియల్ మీ ఎక్స్ 7 5జీ
రియల్ మీ ఎక్స్ 7 5జీ గురుంచి ప్రధానంగా చెప్పుకోవాలంటే మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని చెప్పుకోవాలి. దీని 8జీబీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఈ ధర వద్ద క్వాల్‌కామ్ ప్రాసెసర్ కు సమానంగా మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ పనిచేస్తుంది. గేమింగ్ విషయంలో మంచి పనితీరు కనబరుస్తుంది. దీని బ్యాటరీ జీవితం కూడా ఎక్కువ వస్తుంది. ఇందులో 50 వాట్ ఫాస్ట్ చార్జర్ పొందుతారు. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు. ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 లేదు బ్లోట్‌వేర్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద చిన్న చిన్న సమస్యలు తప్ప అంత పెద్దగా ఇబ్బందులు లేవు. 

ఎంఐ 10ఐ
షియోమీ 2021 లో మొదటగా తీసుకొచ్చిన మొబైల్ ఇదే. ఎంఐ 10ఐ ధర రూ.21,999. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ 5జీ సపోర్ట్ ప్రాసెసర్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇంత తక్కువ ధరకు ఇవి తీసుకొని రావడం ఒక మంచి విషయం. 108 మెగాపిక్సెల్ కెమెరాలలో చిన్న చిన్న సమస్యలు ఉండటం మనం గమనించవచ్చు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారా మెరుపరుస్తారో లేదో చూడాలి. మీరు ఫోటో విషయంలో పెద్దగా పట్టించుకోకపోతే రూ.25,000 ఒక మంచి ఫోన్ అవుతుంది.

వివో వి20
వివో కూడా ఈ సారి మంచి ఫోన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది అని చెప్పుకోవాలి. ఇది 6.44-అంగుళాల ఆమో ఎల్ఈడీ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది చూడటానికి మంచి ప్రీమియం లుక్ ఇస్తుంది.  వివో వి 20 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ సహాయంతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ తాజా వెర్షన్ మీద పనిచేస్తుంది. కెమెరా పరంగా మంచి ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఇది ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ.22,990. 

చదవండి: 

వాట్సప్‌ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా?

మరిన్ని వార్తలు