బీఎండబ్ల్యూ ‘ఎం10000 ఆర్‌ఆర్‌’ బైక్: ధర ఎంతంటే..

26 Mar, 2021 11:25 IST|Sakshi

బీఎండబ్ల్యూ ‘ఎం10000 ఆర్‌ఆర్‌’ బైక్‌ 

ధర రూ.42 లక్షలు 

సాక్షి, ముంబై: జర్మనీ ఆటో తయారీ దిగ్గజం బీఎమ్‌డబ్ల్యూ గురువారం ఎం10000 ఆర్‌ఆర్‌ పేరుతో ప్రీమియం మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసింది. దీని  ఎక్స్‌ షోరూం ధర రూ.42 లక్షలు. కంప్లీట్లీ బిల్ట్‌ అప్‌ యూనిట్‌ (సీబీయూ)రూపంలో భారత్‌లోకి దిగుమతి  అవుతుంది.

ఎం సిరీస్ లో భారత రోడ్లపై పరుగులు తీయనున్న మొట్టమొదటి సూపర్ బైక్ ఇది కావడం విశేషం.  బీఎండబ్ల్యూ ఎస్‌1000 ఆర్‌ఆర్‌ మోడల్‌ తరువాత ఎం సిరీస్‌ తాజా మోడల్‌ను విడుదల చేసింది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే  ఇందులో నాలుగు సిలిండర్లు కలిగిన 999 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఈ బైకు కేవలం 3.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు.   రైడింగ్ కోసం రోడ్, డైనమిక్, రేస్ మోడ్స్ ఏర్పాటు చేశారు.ఇంజిన్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్  అండ్‌ వీలీ కంట్రోల్‌,లాంచ్ కంట్రోల్, పిట్-లేన్ లిమిటర్, హిల్-స్టార్ట్ కంట్రోల్, షిఫ్ట్ ప్రో అసిస్ట్, హీటెడ్ గ్రిప్స్,  క్రూయిజ్ కంట్రోల్ ఇతర కీ ఫీచర్స్‌గా న్నాయి.

 


 

మరిన్ని వార్తలు