ఈ దేశాల నుంచి స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు.. పన్ను లేదు

26 May, 2023 04:22 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ తదితర 21 దేశాల నుంచి అన్‌లిస్టెడ్‌ భారత స్టార్టప్‌ల్లోకి వచ్చే పెట్టుబడులపై ఏంజెల్‌ ట్యాక్స్‌ వర్తించదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. సింగపూర్, నెదర్లాండ్స్, మారిషస్‌ నుంచి వచ్చే పెట్టుబడులకు ఈ అవకాశం కల్పించలేదు.

ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్‌ ఆస్ట్రియా, కెనడా, చెక్‌ రిపబ్లిక్, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, ఐస్‌ లాండ్, జపాన్, కొరియా, రష్యా, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్‌ ఏంజెల్‌ ట్యాక్స్‌ మినహాయింపు జాబితాలో ఉన్నాయి.

అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులను ఏంజెల్‌ ట్యాక్స్‌ పరిధిలోకి తీసుకొస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అనంతరం కొన్ని రకాల విదేశీ ఇన్వెస్టర్ల తరగతులను మినహాయించాలంటూ పరిశ్రమ నుంచి వినతులు రావడంతో.. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు