సైబర్‌ దాడుల సన్నద్ధతపై ‘అరెటే’ ఫోకస్‌

20 Dec, 2022 07:57 IST|Sakshi

హైదరాబాద్‌: సైబర్‌ రిస్క్‌ నిర్వహణ కంపెనీ ‘అరెటే’.. సైబర్‌ దాడుల నిరోధానికి, ఒకవేళ సైబర్‌ దాడులు తలెత్తితే ఆ సమయంలో సన్నద్ధతకు సంబంధించి కొత్తగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ప్రకటించింది. చిన్న, మధ్య తరహా సంస్థల కోసం దీన్ని రూపొందించామని, సహజంగా ఈ సంస్థలే ఎక్కువగా దాడులకు గురవుతుంటాయని, పూర్తి స్థాయిలో వ్యవస్థల పునరుద్ధరణకు 6–8 రోజుల సమయం తీసుకుంటున్నట్టు అరెటే తెలిపింది.

చిన్న, మధ్య తరహా సంస్థల సిస్టమ్స్‌లో అప్పటికే హానికాక సాఫ్ట్‌వేర్‌లు ఏవైనా ఉన్నాయా? కస్టమర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం లీక్‌ అయిందా గుర్తించడంతోపాటు.. పరిశ్రమలోనే అత్యుత్తమ విధానాలు, రిస్క్‌ నిర్వహణతో ఇది ఉంటుందని వివరించింది. సంస్థలకు మరింత రక్షణ కలి్పంచి, సైబర్‌ దాడుల రిస్క్‌ను తగ్గించడమే తమ లక్ష్యమని అరెటే ప్రకటించింది.  

మరిన్ని వార్తలు