ఈక్విటీ పథకాల్లో కొనసాగిన పెట్టుబడులు

14 Jan, 2023 05:56 IST|Sakshi

డిసెంబర్‌లో రూ.7,303 కోట్లు రాక

నవంబర్‌లో వచ్చిన రూ.2,224 కోట్ల కంటే మెరుగు

డెట్‌ ఫండ్స్‌ నుంచి రూ.21,947 కోట్లు ఎగ్జిట్‌

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక డిసెంబర్‌లో బలంగా నమోదైంది. రూ.7,303 కోట్లను ఈక్విటీ ఫండ్స్‌ ఆకర్షించాయి. అంతకుముందు నవంబర్‌ నెలలో వచ్చిన రూ.2,224 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగాయి. డిసెంబర్‌ నెలకు సంబంధించి ఫండ్స్‌ సంస్థల గ ణాంకాలను యాంఫి విడుదల చేసింది. డెట్‌ మ్యూ చువల్‌ ఫండ్స్‌ నికరంగా రూ.21,947 కోట్లను కో ల్పోయాయి. 2022 సంవత్సరం మొత్తం మీద అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తు లు (ఏయూఎం) 5.7 శాతం (రూ.2.2 లక్షల కోట్లు ) వృద్ధి చెంది రూ.39.88 లక్షల కోట్లకు చేరాయి. 2021లో 7 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గింది.

పథకాల వారీగా..
► ఈక్విటీ విభాగంలో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.2,245 కోట్లు వచ్చాయి.  
► లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ నుంచి నికరంగా రూ.26 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌ రూ.203 కోట్ల పెట్టుబడులను కోల్పోయాయి.  
► 24 ఓపెన్‌ ఎండెడ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్ల రూపంలో (నూతన పథకాలు/ఎన్‌ఎఫ్‌వోలు) ఫండ్స్‌ సంస్థలు డిసెంబర్‌లో ఇన్వెస్టర్ల నుంచి రూ.6,954 కోట్లను సమీకరించాయి.  
► 12 క్లోజ్‌ ఎండెడ్‌ ఎన్‌ఎఫ్‌వోలు రూ1,532 కోట్లను సమీకరించాయి.
► మల్టీక్యాప్‌ పథకాల్లోకి రూ.676 కోట్లు రాగా, లా ర్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రూ.1189 కోట్లు ఆకర్షించా యి. మిడ్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.1,962 కో ట్లు వచ్చా యి.  
► వ్యాల్యూ ఫండ్స్‌లోకి రూ.648 కోట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి రూ.564 కోట్లు, ఫ్లెక్సీక్యాప్‌ పథకాల్లోకి రూ.403 కోట్ల చొప్పున వచ్చాయి.
► డెట్‌ విభాగంలో అత్యధికంగా లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి రూ.13,852 కోట్లు బయటకు వెళ్లాయి.  
► మల్టీ అస్సెట్‌ అలోకేషన్‌ పథకాలు రూ.1,711 కోట్లను ఆకర్షించాయి.

సిప్‌ రూపంలో రూ.13,573 కోట్లు
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ రూపంలో (సిప్‌) మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి డిసెంబర్‌ నెలలో రూ.13,573 కోట్లు వచ్చాయి. అంతకుముందు నెల నవంబర్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.13,307 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్‌ వరుసగా వృద్ధి చూపించడం ఇది మూడో నెల. డిసెంబర్‌ చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ మొత్తం ఫోలియోల సంఖ్య 14.11 కోట్లకు చేరింది. ఒక పథకంలో ఇక ఇన్వెస్టర్‌ పెట్టుబడికి కేటాయించే గుర్తింపును ఫోలియోగా చెబుతారు.   

పెట్టుబడులు కొనసాగుతాయి..
‘‘ఇన్వెస్టర్లు సమీప భవిష్యత్తులోనూ మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గంలో పెట్టుబడులు కొనసాగిస్తారు. వృద్ధి ఆధారిత బడ్జెట్‌ కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇది మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించనుంది. దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్న ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు విస్మరించలేదు. సిప్‌ ఖాతాలు పెరగడం దీన్నే సూచిస్తోంది. కొత్తగా డిసెంబర్‌లో 24 లక్షల సిప్‌ ఖాతాలు నమోదయ్యాయి. ఈ సాధనంపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది’’అని యాంఫీ సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు