McLaren: ఎంత మిలియనీర్ అయినా.. ఇండియాలో ఇలాగే ఉంటది!

30 Jun, 2023 15:59 IST|Sakshi

భారతదేశంలో చాలామంది ధనవంతులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి బ్రాండ్ కార్లు మాత్రమే కాకుండా 'మెక్‌లారెన్' (McLaren) వంటి కార్లు కూడా ఉన్నాయి. అయితే మన దేశంలో ఏదైనా వాహనం కొని దానిని ఉపయోగించే ముందు పూజ చేయడం ఆనవాయితీ.. ఇదే పద్దతిని ఒక మిలియనీర్ కూడా పాటించాడు. కోట్ల సంపద కలిగిన వ్యక్తి తన కారుకి పూజ చేయడానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నివేదికల ప్రకారం, ముంబై నగరానికి చెందిన ఒక వ్యాపారవేత్త ఇటీవల సరికొత్త 'మెక్‌లారెన్ 720ఎస్' (McLaren 720S) డెలివరీ చేసుకున్నాడు. డెలివరీ తీసుకున్న తరువాత సమీపంలో ఉండే ఒక గుడి వద్ద పూజ కూడా చేయించాడు. పూజాదికార్యక్రమాలు ముగిసిన తరువాత ముంబైలోని పబ్లిక్ రోడ్‌లపై చక్కర్లు కొడుతూ కనిపించింది. ఈ కారుని చూసిన వారిలో చాలా మంది జనం దానితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.

(ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!)

మెక్‌లారెన్ 720ఎస్:
మెక్‌లారెన్ 720ఎస్ సూపర్ కారు విషయానికి వస్తే, ఇవి భారతీయ మార్కెట్ కోసం 400 యూనిట్లను మాత్రమే కేటాయించారు. ఇది శక్తివంతమైన 4.0 లీటర్ వి8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌ కలిగి 710 Bhp పవర్ 770 Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 341 కి.మీ కావడం విశేషం. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 5 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

(ఇదీ చదవండి: దంపతులిద్దరికీ అదే సమస్య.. వారికొచ్చిన ఐడియా ధనవంతులను చేసిందిలా!)

నిజానికి ఖరీదైన మెక్‌లారెన్ 720ఎస్ స్టాండర్డ్, లగ్జరీ, పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. అయితే ఇవన్నీ చూడటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ.. పర్ఫామెన్స్ విషయంలో టాప్ ఎండ్ మోడల్ ఓ అడుగు ముందుంటుంది. ఇప్పటికీ ఈ ఖరీదైన కారుని ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ, గౌతమ్ సింఘానియా వంటి వారు కూడా కొనుగోలు చేశారు. కంపెనీ అధికారిక డీలర్‌షిప్‌ ముంబైలో ఉంది. అయితే ఈ కార్లు కావాలనుకునే వారు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు