-

తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో రేటు ఎంతంటే?

20 Sep, 2021 13:12 IST|Sakshi

Gold and Silver Price fall: గతేడాది రికార్డు స్థాయి ధరలతో కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి, ఇటు ఫ్యూచర్‌ మార్కెట్‌, అటు ఆభరణాల మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. గతేడాది నమోదైన రికార్డు స్థాయి ధరతో పోల్చితే ప్రస్తుతం బంగారం ధర భారీగా పడిపోయింది.

ఆరు నెలల కనిష్టానికి
బంగారం ధరలు ఆరు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,500లకు చేరుకుంది. సెప్టెంబరు 11న ఇదే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,070లు నమోదు అయ్యింది. పది రోజుల వ్యవధిలో బంగారం ధర దాదాపుగా రూ. 600ల వరకు తగ్గింది, ఇక పెట్టుబడిగా ఉపయోగించే 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,000లకి పడిపోయింది. సెప్టెంబరు 11న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,070గా ట్రేడ్‌ అయ్యింది. తాజాగా తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం ధర రూ. 43,400లకి చేరుకుంది. 

హైదరాబాద్‌లో
గతేడాది ఆగస్టులో హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,200 దగ్గర ట్రేడ్‌ అయ్యింది. ఆ ధరతో పోల్చితే ప్రస్తుతం రూ. 11 వేల వరకు బంగారం ధర తగ్గినట్టయ్యింది. ప్యూచర్‌ గోల్డ్‌కి సంబంధించి ఈ వత్యాసం రూ. 10,.900లుగా ఉంది. తాజాగా తగ్గిన ధరలతో బంగారం ధరలు చూస్తే ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. 

వెండిది అదే బాట
మరోవైపు వెండి రేటు కూడా భారీగా తగ్గింది. 2020 ఆగస్ట్ 7న కిలో వెండి ధర రూ.76,150లుగా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.63,500గా ట్రేడ్‌ అవుతోంది. గరిష్ట ధర నుంచి సుమారు రూ.12,650 వరకు వెండి ధర తగ్గింది. 

గ్లోబల్‌ మార్కెట్‌లో సైతం
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలరుతో బంగారం మారకం విలువ 0.1 శాతం పడిపోయింది. దీంతో గ్లోబల్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1752.66 డాలర్లుగా ఉండగా ఫ్యూచర్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 1753.80 డాలర్లుగా నమోదు అవుతోంది. 

చదవండి : బంగారం ఆభరణాల వర్తకులకు మరింత ఆదాయం

మరిన్ని వార్తలు