వామ్మో.. ఒక్కరోజే రూ. 3,000 కోట్ల బంగారం కొన్నారు, ఎందుకో తెలుసా!

15 Oct, 2022 19:22 IST|Sakshi

కోవిడ్ పరిస్థితి కారణంగా వరుసగా రెండేళ్లుగా నగల వ్యాపారంలో అమ్మకాల్లో పెద్దగా లేవనే సంగతి తెలిసిందే.  ఈ ఏడాది కర్వా చౌత్‌ వేడుక అరుదైన రికార్డు నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే రూ. 3,000 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు జరిగాయి.

ట్రేడర్స్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్‌)  డేటా ప్రకారం, సుమారు రూ. 3,000 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాల అమ్మకాలు జరిగాయని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. ఏడాది క్రితం సుమారు రూ.2,200 కోట్ల బంగారం ఆభరణాలు అమ్ముడయ్యాయని పేర్కొంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.48,000గా ఉండగా, వెండి కిలో రూ.59,000కు చేరుకుందని కెయిట్‌, ఏఐజేజీఎఫ్‌ తెలిపాయి.

“వ్యాపార పరంగా బంగారం వెండి వ్యాపారులు అక్టోబర్, నవంబర్ నెలలను ప్రత్యేకంగా భావిస్తారు. కర్వా చౌత్ తర్వాత, పుష్య నక్షత్రం, ధంతేరాస్, లక్ష్మీ పూజ, దీపావళి, భయ్యా దూజ్, ఛత్ పూజ, తులసి వివాహ వంటి పండుగలతో ఈ నెల నిండి ఉంటుంది, వీటన్నింటిని  అట్టహాసంగా జరుపుతారు’ అని కెయిట్‌ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌, ఏఐజేజీఎఫ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ అరోరా తెలిపారు. ప్రజలు ఈ ఏడాది భారీ మొత్తంలో లైట్‌ వెయిట్‌ జ్యువెలరీ కొనుగోలు చేశారని, సిల్వర్‌ ఆభరణాలు, ఫ్యాషన్‌ జ్యువెలరీ, ట్రెడిషనల్‌ జ్యువెలరీ భారీగా స్థాయిలోనే కొన్నారన్నారు.

చదవండి: యాపిల్‌కు భారీ షాక్‌.. అవి లేకపోతే ఐఫోన్లు అమ్మకండి!

>
మరిన్ని వార్తలు