Google Doodle Games: గూగుల్‌లో పిజ్జా సింబల్‌ క్లిక్‌ చేస్తే ఏమవుతుంది? అసలు ‘పిజ్జా’ విలువ ఎంతంటే..

6 Dec, 2021 16:11 IST|Sakshi

Google Doodle Celebrating Pizza:  ఇవాళ గూగుల్‌ ఓపెన్‌ చేశారా? చేస్తే.. డూడుల్‌లో ఉన్న పిజ్జా మార్క్‌ను చూశారా?.. కనీసం క్లిక్‌ చేసి చూశారా?..  ప్రపంచంలో  మోస్ట్‌ పాపులర్‌ డిష్‌ అయిన పిజ్జాకు ఇదేరోజున ఓ అరుదైన గుర్తింపు దక్కింది. 2017 డిసెంబర్‌లో పిజ్జా సంప్రదాయ తయారీ విధానం Neapolitan "Pizzaiuolo"(నేపుల్స్‌-ఇటలీ)కు యునెస్కో తరపున అరుదైన గుర్తింపు దక్కింది. అందుకే గూగుల్‌ డూడుల్‌ ద్వారా మినీ గేమ్‌ను నిర్వహిస్తోంది. 


ఈ మినీ పజిల్‌ గేమ్‌ ఉద్దేశం ఏంటంటే.. పిజ్జాను కట్‌ చేయడం. సాధారణంగా పిజ్జాలను వాటిలోని వెరైటీల ఆధారంగా డిఫరెంట్‌ షేప్స్‌లో కట్‌ చేసి(కస్టమర్ల సంఖ్యకు తగ్గట్లుగానే).. సర్వ్‌ చేస్తుంటారు. అయితే ఈ గేమ్‌ ఆడేవాళ్లు అక్కడ చూపించే  పిజ్జా వెరైటీని సరిగ్గా అక్కడ చూపించే నెంబర్స్‌కి.. సరిపోయేలా సరైన విధానంలో చేయాలి. కరెక్ట్‌గా కట్‌ చేస్తేనే పాయింట్లు(స్టార్స్‌) దక్కుతాయి. అలా లెవెల్స్‌ను దాటుకుంటూ కాయిన్స్‌ కలెక్ట్‌ చేసుకుంటూ వెళ్లాలి. 

పిజ్జా.. ఇటాలియన్‌ డిష్‌ అనే ప్రచారం వందల ఏళ్ల నుంచి ఉంది. ఎందుకంటే ఆ డిష్‌ పుట్టింది ఇటలీలోనే అని నమ్ముతారు కాబట్టి!(ఈజిప్ట్‌ అనే ప్రచారం కూడా ఉంది).

నెపోలిటన్‌ పిజ్జాయ్‌యువొలొ.. అనేది పిజ్జాను సంప్రదాయ పద్దతిలో(నాలుగు దశల్లో) కట్టెలతో కాల్చే ఒవెన్‌ ద్వారా తయారు చేయడం. 

నేపుల్స్‌(కాంపానియా రీజియన్‌ రాజధాని)లో 3 వేలమంది పిజ్జా తయారీదారులు ఉన్నారు. 

పిజ్జాను తయారు చేసే వ్యక్తిని ‘పిజ్జాయ్‌యువొలొ’ అంటారు. 

పిజ్జా పరిశ్రమ ప్రపంచ స్థాయిలో బిలియన్‌ డాలర్ల బిజినెస్‌ చేస్తుంటుంది. 

2020 పిజ్జా గ్లోబల్‌ బిజినెస్‌లో..  వెస్ట్రన్‌ యూరప్‌ వాటా అత్యధికంగా ఉంది. ఏకంగా 49.3 బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేసింది. 

ఉత్తర అమెరికా 48.6 బిలియన్‌ డాలర్లు. 

ఆసియా దేశాల్లో 11.7 బిలియన్‌ డాలర్లు

ఆస్ట్రేలియా పరిధిలో అతితక్కువగా 1.9 బిలియన్‌ డాలర్ల బిజినెస్‌ చేసింది. 

ప్రతీ ఏడాది ఐదు బిలియన్ల పిజ్జాలు అమ్ముడుపోతుంటాయి (సెకనుకి ఒక్క అమెరికాలోనే 350 పిజ్జాల ఆర్డర్‌) వెళ్తుంటాయి. 

2019 నుంచి పిజ్జా మార్కెటింగ్‌ గ్లోబల్‌ వైడ్‌గా విపరీతంగా జరుగుతోంది.

2023 నాటికి పిజ్జా బిజినెస్‌ ప్రపంచవ్యాప్తంగా సుమారు 233.26 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందనేది ఒక అంచనా. 

సోషల్‌మీడియా అడ్వర్టైజింగ్‌ కీలక పాత్ర వహించబోతోందని మార్కెటింగ్‌ నిపుణుల అంచనా. 

నార్వే, స్వీడన్‌లలో ఫ్రొజెన్‌, గ్లూటెన్‌ పిజ్జాలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటోంది ఇప్పుడు. 

యూరప్‌, నార్త్‌ అమెరికా, ఆసియా-ఫసిఫిక్‌, లాటిన్‌ అమెరికా ఖండాల రీజియన్లను పరిశీలిస్తే.. ఇటలీ, యూకే, జర్మనీ, కెనడా, చైనా, భారత్‌, బ్రెజిల్‌.. పిజ్జా మార్కెట్‌ను  మరో లెవల్‌కు తీసుకెళ్లనున్నాయి. 

భారత్‌లో కరోనా సీజన్‌లోనూ కిందటి ఏడాది పిజ్జా బిజినెస్‌ మార్కెట్‌ వాల్యూ 1.52 బిలియన్‌ డాలర్లు దాటేసింది.

► యువత, పిల్లలు, మధ్య, ఎగువ తరగతి వర్గాల ప్రజల నుంచి పిజ్జాకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి.

మొత్తం భారత్‌ పిజ్జా మార్కెట్‌లో డొమినోస్‌ వాటా 55 శాతంగా ఉంటోంది.  పైగా డొమినోస్‌ 70 శాతం హోం డెలివరీలతోనే ఆదాయం వెనకేసుకుంటోంది. 

ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ నాటికి భారత్‌లో 45 మిలియన్ల మంది పిజ్జా డెలివరీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

అయితే భారత్‌లో బ్రాండెడ్‌ పిజ్జా బిజినెస్‌తో పోలిస్తే.. స్ట్రీట్ పిజ్జా మార్కెట్‌ బిజినెస్‌ విపరీతంగా నడుస్తోంది. ఆ ఆదాయం లెక్కలోకి తీసుకుంటే   బ్రాండెడ్‌ పిజ్జా మార్కెట్‌కు మూడు రెట్లు ఎక్కువే ఉంటుందనేది నిపుణుల అంచనా.

ఎదురయ్యే ఛాలెంజ్‌.. పిజ్జా తయారీలో వాడే ముడిసరుకుల ధరలు ఆకాశాన్ని అంటడం.. ఇండిపెండెంట్‌ ఆపరేటర్లతో పాటు ఔట్‌లెట్లు, ఫ్రాంఛైజీలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లు. 

-సాక్షి వెబ్‌స్పెషల్‌

మరిన్ని వార్తలు