వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేసేవారికి గూగుల్ షాకింగ్ న్యూస్!

11 Aug, 2021 08:52 IST|Sakshi

ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల వేతనంలో కంపెనీలు కొంత మొత్తం కట్ చేసే అవకాశం ఉందా? అంటే అవును, అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మహమ్మారికి ముందు కార్యాలయంలో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయడానికి మారితే వేతనంలో కొతలు విధించే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇప్పుడు ఈ విషయం గురుంచి సిలికాన్ వ్యాలీ అంతటా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు తక్కువ ఖరీదైన ప్రాంతాలకు వెళ్ళే రిమోట్ ఉద్యోగులకు వేతనాన్ని తగ్గించాయి. 

ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ ఉద్యోగులు ఉంటున్న లొకేషన్ ఆధారంగా జీతాలు నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, సంస్థ వారి ఉద్యోగుల లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే అవకాశం ఉంది. "ఉద్యోగులకు చెల్లిస్తున్న ప్యాకేజీలు ఎల్లప్పుడూ స్థానం ఆధారంగా నిర్ణయించబడ్డాయి. ఒక ఉద్యోగి ఎక్కడ నుంచి పనిచేస్తాడో దాని ఆధారంగా మేము ఎల్లప్పుడూ స్థానిక మార్కెట్లో ఉన్న వారికంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు" గూగుల్ ప్రతినిధి తెలిపారు. వేతనం అనేది నగరం నుంచి నగరానికి, రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది. జూన్ లో ప్రారంభించిన కంపెనీ వర్క్ లొకేషన్ టూల్ అంచనాల ప్రకారం.. ఇంటి నుంచి పనిచేసే వారి వేతనంలో సుమారు 10 నుంచి 20 శాతం కోత విధించనున్నట్లు తెలుస్తుంది.

మరిన్ని వార్తలు