సామాన్యుడి షాక్‌..క్యూ కట్టిన బ్యాంకులు..!

5 Dec, 2021 14:11 IST|Sakshi

New Atm Withdrawal Charges From 2022: కొత్త ఏడాది నుంచి సామాన్యులపై చార్జీల మోత‌ మోగించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యా​యి. జనవరి 1 నుంచి ఎవరైతే ఏటీఎం సెంటర‍్ల నుంచి డబ్బులు డ్రా చేస్తారో వారి వద్ద నుంచి బ్యాంకులు అదనపు ఛార్జీల్ని వసూలు చేయనున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ సైతం జనవరి 1నుంచి ఏటిఎం నగదు విత్ డ్రాకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. 

పలు నివేదికల ప్రకారం..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాక్సిస్‌ బ్యాంక్‌ ఆర్బీఐ నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతి నెల బ్యాంక్‌ అకౌంట్‌ హోల్డర్లు ఏటీఎం సెంటర్‌లలో ఐదు లావాదేవీలు దాటితే యాక్సిక్‌ బ్యాంక్‌ అదనపు ఛార్జీలను విధించనుంది. ప‌రిమితి దాటితే ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వ‌సూలు చేయనుంది. 

ఇప్పుడు యాక్సిక్‌ బ్యాంక్‌ బాటలో మరో ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ సైతం సేవింగ్ అకౌంట్‌ పై సర్వీస్‌ ఛార్జీలతో పాటు, ఏటీఎం నగదు లావా దేవీలలో పరిధి దాటితో  ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వ‌సూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మెట్రో నగరాల్లో నెలకు మూడుసార్లు, ఇతర నగరాల్లో ఐదుసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్ర‌కారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు త‌మ సొంత బ్యాంకుతోపాటు ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల వ‌ద్ద ప‌రిమితికి మించి చేసే విత్‌డ్రాయ‌ల్స్‌పై చార్జీలు పెరుగ‌నున్నాయి.

చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..! 

మరిన్ని వార్తలు