ఐసీఐసీఐ బ్యాంక్‌ రూపీ వోస్ట్రో ఖాతాలు

1 May, 2023 06:20 IST|Sakshi

ముంబై: రూపీ వోస్ట్రో ఖాతాలను ఆఫర్‌ చేస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది. ఎగుమతి, దిగుమతిదారులు వోస్ట్రో ఖాతాల ద్వారా రూపాయి మారకంలో చెల్లింపులు చేసుకోవచ్చ ని పేర్కొంది. ఇన్‌వాయిస్, చెల్లింపులకు ఐఎన్‌ఆర్‌ను ఉపయోగించడం ద్వారా విదేశీ కరెన్సీ మారకం రిస్క్‌ తగ్గుతుందని తెలిపింది.

29 దేశాల్లోని కరస్పాడెంట్‌ బ్యాంకుల్లో 100కుపైగా రూపీ వోస్ట్రో అకౌంట్‌లకు కలిగి ఉన్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానం 2023కు తోడు, ఎగుమతులు, దిగుమతులు, ఇన్‌వాయిసింగ్‌ ఐఎన్‌ఆర్‌లో ఉండాలన్న ఆర్‌బీఐ కార్యాచరణకు అనుగుణంగా ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు