బంగారం వెండి, వంటనూనెల బేస్‌ దిగుమతి రేటు తగ్గింపు

16 Jun, 2022 13:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  వంటనూనెలు, బంగారం, వెండి  బేస్‌ దిగుమతి రేట్లపై సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ  బుధవారం  ఆలస్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రేట్లు నేటి నుంచే  (జూన్‌16) అమలులోకి వచ్చాయి. 

ఎడిబుల్ ఆయిల్స్, గోల్డ్, సిల్వర్ బేస్ దిగుమతి ధరలను ప్రతీ 15 రోజులకు ఒకసారి సవరిస్తూ ఉంటుంది. వీటి ఆధారంగా దిగుమతిదారులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  క్రూడ్ పామ్ ఆయిల్, సోయా ఆయిల్, గోల్డ్, సిల్వర్ పై దిగుమతి సుంకాన్ని కోత పెట్టింది.  మరోవైపు ఇతర వాటి బేస్ దిగుమతి ధరలు మాత్రం పెరిగాయి ముఖ్యంగా  క్రూడ్ పామోలిన్, ఆర్‌బీడీ పామోలిన్, ఇతర పామోలిన్, బ్రాస్ స్క్రాప్ ధరలు మాత్రం పెరిగాయి.  

క్రూడ్ పామ్ ఆయిల్ బేస్ దిగుమతి ధర 1625 డాలర్ల నుంచి 1620 డాలర్లకు తగ్గింది. క్రూడ్ సోయా బీన్ ఆయిల్ రేటు 1866 డాలర్ల నుంచి 1831 డాలర్లకు తగ్గింది.  గోల్డ్ బేస్ దిగుమతి ధర 597 డాలర్ల నుంచి 585 డాలర్లకు దిగి వచ్చింది.  సిల్వర్ బేస్ దిగుమతి ధర 721 డాలర్ల నుంచి 695 డాలర్లకు తగ్గింది. 
మరోవైపు ఆర్‌బీడీ పామ్ ఆయిల్ రేటు 1733 డాలర్ల నుంచి 1757 డాలర్లకు పెరిగింది. ఇతర పామ్ ఆయిల్ బేస్ దిగుమతి రేటు 1679 డాలర్ల నుంచి 1689 డాలర్లకు ఎగసింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిదారు ఇండియా గత నెలలో 2 మిలియన్ టన్నుల సోయాయిల్‌ను సుంకం రహిత దిగుమతులకు  అనుమతించింది.  2 మిలియన్ టన్నుల సోయా ఆయిల్‌ దిగుమతికి ఇది వర్తిస్తుంది. వెండి, బంగారం మినహా బేస్ ధరలు ప్రతి కమోడిటీకి టన్నుకు డాలర్ చొప్పున  ఉంటుంది. గోల్డ్ టారిఫ్  10 గ్రాములకు ఒక డాలర్, అలాగే వెండికి  కేజీకి  డాలర్‌గా  ఉంటుంది.  కాగా దేశంలో  గురువారం  బంగారం ధరలు క్షీణించాయి.  పది గ్రాముల పసిడి రూ. 270 పడిపోగా,  కిలో వెండి ధర  మాత్రం స్థిరంగా ఉంది. 

మరిన్ని వార్తలు