గ్యాస్‌ ధరలు డబుల్‌...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..?

31 Mar, 2022 19:39 IST|Sakshi

ఇంధన ధరల పెంపుతో ఇప్పటికే సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీటికి తోడుగా నేచురల్‌ గ్యాస్‌ ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. 

కొత్త ధరలు ఏప్రిల్‌ 1 నుంచి..!
ఏప్రిల్‌ 1 నుంచి నేచురల్ గ్యాస్ ధరలు రెండింతలు పెరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా స్థానికంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. నేచురల్‌ గ్యాస్‌ ధరల పెంపుతో భారత్‌ను ద్రవ్యోల్భణ భయాలు మరింత ఎక్కువయ్యేలా కన్పిస్తోంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి గాను నేచురల్ గ్యాస్ ధరలు ఒక్కో మిలియన్ మెట్రిక్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్(ఎంఎంబీటీయూ) ధరను 6.1 డాలర్లకు చేరనుంది. కాగా ప్రస్తుతం నేచురల్‌ గ్యాస్ ధర ఒక్కో ఎంఎంబీటీయూ 2.90 డాలర్లుగా ఉండేది.

రిలయన్స్‌, ఓఎన్‌జీసీలకు బొనాంజా..!
నేచురల్‌ గ్యాస్‌ ధరల పెంపుతో రిలయన్స్‌, ఓఎన్‌జీసీ సంస్థలు భారీగా లాభపడనున్నాయి. కేజీ గ్యాస్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఒక్కో ఎంఎంబీటీయూపై సుమారు 10 డాలర్లు లభించనుంది. దాంతో పాటుగా ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ), లబ్ధి చేకూరనుంది. 

సామన్యులపై ప్రభావం ఎంతంటే..?
2021 జనవరి-డిసెంబర్‌ కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్‌ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్‌ 1–సెప్టెంబర్‌ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయిస్తుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్‌ ధరలపై పడనుంది. గ్యాస్‌ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. కాగా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చునని తెలుస్తోంది.

చదవండి: సామాన్యులకు మరో షాక్‌..భారీగా పెరగనున్న బిస్కెట్‌ ధరలు..!

మరిన్ని వార్తలు