‘ఎస్‌బీఐ లాంటివి నాలుగైదు బ్యాంకులు కావాలి’

26 Sep, 2021 15:27 IST|Sakshi

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థ మరింత వేగంగా పని చేయాలంటే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాంటి ‍ బ్యాంకులు నాలుగైదు కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ముంబైలో జరిగిన ఇండియన్‌ బ్యాంక్‌ 74వ వార్షిక సమావేశంలో ఆమె మాట్లాడారు.  

కరోనా ప్యాండెమిక్‌ తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని మంత్రి చెప్పారు. ఈ తరుణంలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా నగదు చలామనీ చేసేందుకు మరిన్ని బ్యాంకులు రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలు ఎ‍క్కువగా జరిగే ప్రతీ చోట డిజిటల్‌గా లేదా ప్రత్యక్షంగా బ్యాంకులు ఉండాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. 

దేశంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయడం వల్ల పెద్ద బ్యాంకులు ఏర్పడే అవకాశం కలిగిందని నిర్మలా సీతారామన్‌ వివరించారు. ఇప్పటి వరకు రెండు దశల్లో కేంద్రం పలు ప్రభుత్వ రంగ బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసింది. అందులో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పేరుతో అన్ని బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనం అయ్యాయి.
 

చదవండి : అక్టోబర్‌ నెలలో బ్యాంక్‌ సెలవులు ఇవే

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు