అసలేం జరుగుతోంది.. భారత్‌లో సేవా రంగం స్పీడు తగ్గింది

4 Aug, 2022 08:27 IST|Sakshi

జూలైలో 55.5కు పీఎంఐ సూచీ

నాలుగు నెలల కనిష్ట స్థాయి

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం స్పీడ్‌ జూలైలో భారీగా తగ్గింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ జూలైలో 55.5కు పడిపోయింది. గడచిన నాలుగు నెలల్లో సూచీ ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. జూన్‌లో సూచీ 59.2 వద్ద ఉంది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు.

ఈ ప్రాతిపదికన సేవల రంగం వృద్ధి ధోరణిలోనే ఉండడం ఇది వరుసగా 12వ నెల. భారత సేవల ఎకానమీలో క్రియాశీలత భారీగా తగ్గినట్లు సర్వేలో వెల్లడైందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కిట్‌ ఇంటిలిజెన్స్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. ఇక సేవలు, తయారీ రంగం కలిసిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ జూన్‌లో 58.2 వద్ద ఉంటే, జూలైలో 56.6కు తగ్గినట్లు పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. మార్చి తర్వాత ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి.

చదవండి: Airtel 5G Service: గెట్‌ రెడీ.. ఆగస్ట్‌లో 5జీ సేవలు: ఎయిర్‌టెల్‌

మరిన్ని వార్తలు