Apple: 50 బిలియన్‌ డాలర్ల లక్ష్యం...! యాపిల్‌..మేక్‌ ఇన్‌ ఇండియా..!

2 Jan, 2022 15:30 IST|Sakshi

మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా భారత్‌లో మరిన్ని తయారీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం  ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 

50 బిలియన్‌ డాలర్లే లక్ష్యంగా..!
వచ్చే 5-6 ఏళ్లలో భారత్‌లో యాపిల్‌ వార్షిక ఉత్పత్తిని సుమారు 50 బిలియన్‌ డాలర్లకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా లోకల్‌ మేడ్‌ ఐఫోన్స్‌, మ్యాక్‌బుక్స్‌, ఐప్యాడ్స్‌, ఎయిర్ పాడ్స్‌ వంటి యాపిల్‌ ఉత్పత్తులను భారత్‌లో తయారుచేయాలని కేం‍ద్రం కోరింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు యాపిల్‌ అధికారులతో ఇటీవల సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రితో సహా సీనియర్‌ ప్రభుత్వ అధికారులు హజరైనట్లు సమాచారం.

పది లక్షల ఉద్యోగాల కల్పన..!
వచ్చే ఐదారు ఏళ్లలో  భారత్‌లో పది లక్షల ఉద్యోగాలను కల్పించే విధంగా కంపెనీ పనిచేస్తోందని యాపిల్‌ ప్రొడక్ట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అంతేకాకుండా 2017 నుంచి  బెంగళూరులో ఫెసిలిటీ సెంటర్‌లో ఐఫోన్‌ తయారీ కేంద్రాన్ని యాపిల్‌ ఏర్పాటు చేసిందనే విషయాన్ని గుర్తుచేశారు. ఐఫోన్‌ విడిభాగాల ఓఈఎమ్‌ సంస్థ ఫాక్సాకాన్‌ చెన్నైలో ఇప్పటికే ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12 స్మార్ట్‌ఫోన్ల అసెంబ్లీ చేస్తోంది.  

చదవండి: చిక్కుల్లో యాపిల్‌..విచారణకు ఆదేశాలు

మరిన్ని వార్తలు